
కంకిపాడు, అక్టోబర్ 21:-దేశానికి ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో పోలీసులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

సరిహద్దుల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పిస్తూ కార్యక్రమం ప్రారంభమైంది. ర్యాలీ లో పోలీసులు “జై హింద్ – అమరవీరులకి వందనం” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు ఎస్‌ఐ తాతాచార్యులు, ట్రైనింగ్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా బలగాల దాడిని ఎదుర్కొని దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం గా జరుపుకుంటున్నారు.దేశ భద్రత కోసం త్యాగం చేసిన వీర జవాన్లకు పోలీసులు మరియు విద్యార్థులు రెండు నిమిషాల మౌన ప్రర్థనతో నివాళులర్పించారు.






