
గుంటూరు;23-10-25:-గుంటూరు: నగరాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేస్తూ, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) అధ్యక్షతన నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన అత్యవసర సమావేశంలో పలు ప్రజోపయోగకరమైన అభివృద్ధి పనులపై చర్చించడంతో పాటు, వాటికి ఆమోదం లభించింది.సమావేశంలో గౌరవ సభ్యులు, అధికారులు ప్రతిపాదించిన అనేక అంశాలను మేయర్ పరిశీలించగా, నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి.

ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఏ.యస్, MLC చంద్రగిరి ఏసురత్నం, MLA లు మహమ్మద్ నసీర్, గళ్ళ మాధవి, బూర్ల రామాంజనేయులు, డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్రబాబు, షేక్ సజీల, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, సెక్రటరీ బి. శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్లు సి.హెచ్ శ్రీనివాస్, టి. వెంకట కృష్ణయ్య, సిటీ ప్లానర్ రాంబాబు, ఇన్చార్జి ఎస్.ఇ. సుందర్ రామిరెడ్డి, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మరియు విభాగాధిపతులు పాల్గొన్నారు.

మేయర్ రవీంద్ర నాని మాట్లాడుతూ — “నగర అభివృద్ధి కోసం ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలి. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.






