
ఎంపీ బాలశౌరి, చిలకలపూడి పాపారావు పాల్గొనడం
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం:
నాగుల చవితి పండుగ సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు పాల్గొన్నారు. Pedana:సీతనపల్లిలో వైన్ షాప్‌కు మహిళల తీవ్ర వ్యతిరేకత
ఆలయానికి విచ్చేసిన వారిని ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆర్చనలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా మండలి వెంకట్రాం, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.







