
GUNTUR:తుఫాన్ నేపథ్యంలో నగర ప్రజలు జిఎంసి సరఫరా చేసే నీటిని రెండు మూడు రోజులు కాచి చలార్చి త్రాగాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. ప్రకాశం బ్యారేజిలో వరద నీరు రావడం వలన నీటిలో బురదశాతం అధికంగా ఉంటుందని, ఇప్పటికే జిఎంసి హెడ్ వాటర్ వర్క్స్ లో ఆలం, క్లోరిన్ ని నిర్దేశిత ప్రమాణాలు పరిశీలించే సరఫరా చేస్తున్నామనన్నారు.
సచివాలయ ఎమినిటి కార్యదర్శులు కూడా సచివాలయం పరిధిలో 10కి తగ్గకుండా త్రాగునీటి శ్యాంపిల్స్ తీసి క్లోరిన్ చెక్ చేయాలన్నారు. ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా లేదా పైప్ లైన్ల లీకులను గుర్తిస్తే తక్షణం జిఎంసి కాల్ సెంటర్ 08632345103 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్న కమిషనర్.







