
ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో పోలీసులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోలీసుల సేవలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ కల్యాణ మండపంలో గురువారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ప్రజలకు రక్షణ కల్పించే సందర్భంలో పోలీసులు ఉపయోగించే ఆయుధాల గురించి విద్యార్థులకు వివరించారు. దేశ సేవలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీసులను ప్రజలకు దగ్గర చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతుందని అన్నారు.







