ఆంధ్రప్రదేశ్
LETTEST NEWS:మహా కుంభమేళాలో తొక్కిసలాటసంఘటన పై డిప్యూటీ సి.ఎం పవన్ కళ్యాణ్ స్పందన…
మహా కుంభమేళాలో తొక్కిసలాట
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 20 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించాలని కోట్ల మంది వచ్చిన క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరం. మన తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.