ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత, భరోసా వచ్చిందని మంత్రి అనిగాని సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్రావు, ఎంపీ శ్రీభరత్ మీడియాతో మాట్లాడారు. మంత్రి అనగాని మాట్లాడుతూ.. “ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు. ఎప్పటినుంచో ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తున్నాం. సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతోంది. దాదాపు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. గతంలో జీవో నెం. 225 ఇచ్చాం. ఎంత భూమి ఆక్రమణకు గురైందో.. దానికి సమానంగా భూమి ఇచ్చేందుకు ఆనాడు నిర్ణయించారు. జీవో రాగానే కొంత మంది కోర్టుకు వెళ్లారు. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేకపోయింది. సుమారు 12,149 కుటుంబాలకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేకపోయిందని ఆయన వెల్లడించారు.
243 Less than a minute