
తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం పంపిణీ చేశారు. ఏటి అగ్రహారం ప్రాంతంలోని రేషన్ షాపు వద్ద బాధితులకు ప్రభుత్వం తరపున బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, పంచదార, ఉల్లిపాయలు వంటి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… గత రెండు మూడు రోజులుగా ఏపీ ప్రజలు ఒక విపత్కర పరిస్థితిని కలిసికట్టుగా చాలా సమర్ధవంతంగా ఈ మొంథా తుఫాన్‌ని ఎదుర్కొన్నాము. GUNTUR NEWS.:లభించిన బాలు మృతదేహం..
సీఎం చంద్రబాబు, పార్టీ లోకేష్ , పవన్ కళ్యాణ్ నిరంతర సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో, రాష్ట్రవ్యాప్తంగా ఈ తుఫాన్‌ని ఎంత ప్రణాళికబద్ధంగా ఎదుర్కొన్నామో ప్రజలందరూ చూశారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెద్దగా లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కొంతమంది లోతట్టు ప్రాంత ప్రజలు ముంపుకు గురయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 325 మంది తుఫాన్ బాధితులు గత రెండు రోజులుగా రిహాబిలిటేషన్ సెంటర్లలో ఆశ్రయం పొందారు. బాధితులందరికీ ప్రభుత్వం తరఫున ఈరోజు ఏటి అగ్రహారంలో 60 మందికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నాం. పంపిణీ చేయటం జరిగిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.అధికారులు, స్థానిక డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరం కలిసి బాధిత కుటుంబాలందరికీ సరుకులు అందేలా చూస్తామన్నారు. 2025 CALENDER
కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ప్రజలు ఈ సహాయక చర్యల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. కిందస్థాయి కార్యకర్తల నుండి సీఎం వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం పర్యవేక్షించారు. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందించారు. మా కార్యకర్తలు, కార్పొరేటర్లు ప్రజలతోనే ఉండి సేవ చేశారు. అందుకే ఈ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోగలిగాము,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. GUNTUR NEWS:రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన
ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఎప్పటికీ నిలబడే ప్రభుత్వం. అందుకే ప్రజలు ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికే జై కొడతారు. ఈ తుఫాన్ సహాయక చర్యల్లో మాకు అండగా నిలిచిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ , ఎంఆర్ఓ , ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. తుఫాన్ అనంతరం అనేక ప్రాంతాల్లో డ్రైనేజ్, సిల్టేషన్, శానిటేషన్ సమస్యలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి అంశాలను రెండు మూడు రోజుల్లోనే అధికారులు సమర్ధవంతంగా పరిష్కరించారు. ఇకపై ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో శుభ్రత, విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు కొనసాగుతాయి,” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హామీ ఇచ్చారు.







