
సేవభావంతో ముందుకు వచ్చి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన యేసుతో సహవాసం గ్రూప్ సభ్యులను సామాజికవేత్త అడ్వకేట్ మాదాసు భానుప్రసాద్ అభినందించారు.
యేసుతో సహవాసం గ్రూప్ సభ్యురాలు కే. రత్నకుమారి మరియు ఆమె కుటుంబ సభ్యులు, బైబిల్ క్విజ్ పోటీలలో సాధించిన నగదు బహుమతిని వినియోగిస్తూ, పట్టణంలోని పేద మరియు అవసరమైన కుటుంబాలకు ఒక నెలకు సరిపడ నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. చిలకలూరిపేటలో వరద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని
- బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మాట్లాడే సామర్థ్యం కోల్పోయి చికిత్స పొందుతున్న షేక్ నాగూర్ షరీఫ్ కుటుంబానికి
- షుగర్ వ్యాధితో బాధపడుతున్న అచ్చయ్య కుటుంబానికి
- తల్లి తండ్రి లేని ఇద్దరు మనవరాల్లను పోషిస్తూ కాలు విరిగి చికిత్స పొందుతున్న మరియమ్మ కుటుంబానికి
25 కేజీల బియ్యం మరియు 20 రకాల నిత్యవసర సరుకులు అందజేశారు. చిలకలూరిపేటలో వరద బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజిని
సేవా మార్గంలో నడిచిన ఈ కార్యక్రమాన్ని అడ్వకేట్ భానుప్రసాద్ అభినందిస్తూ, గ్రూప్ సేవా కర్తలు జాన్ వెస్లీ మరియు స్థానిక పాస్టర్ ప్రసన్న బాబు కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మనోహర్, కుంచాల భాస్కర్, వనజ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరి పేట, నాదెండ్ల , యడ్లపాడు పనిచేయుటకు రిపోర్టర్స్ కావలెను సంప్రదించండి: 9912530426







