
గుంటూరు, అక్టోబర్ 30: ప్రజల ఆరోగ్య రక్షణకు సేవా భావంతో పనిచేస్తున్న మానవత స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో, S.H.O. హైపర్టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లినిక్, గుంటూరు–2 సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ నెల పొడవునా ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. గుంటూరు బ్రోడిపేట 2/1లోని S.H.O. బిల్డింగ్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ శిబిరాలు జరుగుతాయి.
నవంబర్ 2న డయాబెటిస్, థైరాయిడ్ మరియు హార్మోన్ల వ్యాధులపై ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఎండోక్రినాలజీ నిపుణుడు డాక్టర్ వి.బి. కాశ్యాప జన్నాభట్ల, M.D., D.M., (Endocrinology)ఎండోక్రైనాలజీస్ట్ ప్రజలకు ఉచిత సలహాలు, పరీక్షలు అందిస్తారు. నవంబర్ 9న వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శిబిరం జరుగుతుంది. ఈ శిబిరంలో జెరియాట్రిక్ వైద్య నిపుణుడు డాక్టర్ మోహనరావు పాల్గొని వృద్ధులలో కనిపించే సమస్యలకు చికిత్స సూచిస్తారు.
నవంబర్ 16న హృదయ సంబంధిత వైద్య శిబిరం జరుగుతుంది. ఈ శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ శేఖర్ మాలిని గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తారు. నవంబర్ 23న ఫిజియోథెరపీ, కీళ్ల నొప్పులు, పేశీ బలహీనత వంటి సమస్యలపై ప్రత్యేక శిబిరం నిర్వహించబడుతుంది. ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎస్. ప్రసాద్ పాలు పంచుకుంటారు. నవంబర్ 30న మెదడు, నరాల వ్యాధులపై న్యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు సేవలందిస్తారు.








