ఆంధ్రప్రదేశ్

5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు… రాష్ట్ర, ప్రజల ఆస్తులు లూటీ.. ఇదీ జగన్ ఘనత

పల్నాడు జిల్లా చిలకలూరిపేట. రిపోర్టర్ రవి కిరణ్

5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు… రాష్ట్ర, ప్రజల ఆస్తులు లూటీ.. ఇదీ జగన్ ఘనత


అంతులేని అవినీతి, అరాచకపాలనతో నవ్యాంధ్రప్రదేశ్ ను నామరూపాల్లేకుండా చేసిన జగన్ రెడ్డి, వైసీపీనేతలు నేడు కూటమిప్రభుత్వంపై, చంద్రబాబు పనితీరుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని, నిజాలు అంగీకరించే దమ్ము, ధైర్యం లేకనే వైసీపీనేతలు వాస్తవాలు విస్మరించి పెద్ద నీటిమంతుల్లా మాట్లాడుతున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారడానికి, ఆఖరికి ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం తర్జనభర్జన పడే పరిస్థితి రావడానికి ముమ్మాటికీ జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వ అవినీతే కారణమని బుధవారం పత్రికాప్రకటన ద్వారా పుల్లారావు తేల్చిచెప్పారు. ప్రకృతి వనరుల్ని, ప్రజల ఆస్తుల్ని అడ్డగోలుగా దోచేసిన జగన్ రెడ్డి అండ్ కో రాష్ట్రంపై రూ.10లక్షల కోట్ల అప్పులభారం మోపింది వాస్తవం కాదా? ప్ర‌శ్నించారు. అప్పులభారం… రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. జగన్ చేసిన విధ్వంస ప్రభావం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా చంద్రబాబు పట్టుదల, సంకల్పంతో ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికోసం పాటుపడుతున్నారని తెలిపారు. .

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button