
vijayawada:01-11-25:-అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్సిఐటియు, కెవిపిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభండాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికుల తొమ్మిది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, కెవిపిఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి.ఉదయం దీక్షకు ప్రారంభం పలికిన కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మృతి వనం కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.

తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం” అని అన్నారు.వేతనాల సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు నెలల తరబడి వేతనాల కోసం పోరాడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. “కుటుంబాలు ఎలా గడవాలి? దీనిపై ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి” అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనాన్ని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం దాన్ని వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సిఐటియు, కెవిపిఎస్ ఉద్యమానికి అండగా ఉంటుందని తెలిపారు.
మొదటి రోజు రిలే నిరాహార దీక్షలను సాయంత్రం సిఐటియు సెంట్రల్ సిటీ నాయకుడు యం. సోమేశ్వరరావు జ్యూస్ ఇవ్వడం ద్వారా విరమింపజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్ అధ్యక్షులు కె. దుర్గారావు, సిఐటియు నాయకులు యం. బాబురావు, వై. సుబ్బారావు, అలాగే అంబేద్కర్ స్మృతి వనం కాంట్రాక్ట్ కార్మికులు పి. సునీత, పి. విజయ్ కుమారి, పి. మేరీ, ఎం. సుజాత, యం. దీపిక, కె. అనూష, పి. సత్యవతి, కె. ధనలక్ష్మి, సి.హెచ్. మల్లిక, కె. హరిత, ఎల్. తేరోజమ్మ, ఎస్.కె. జుబేదా తదితరులు పాల్గొన్నారు.







