
అమరావతి, నవంబర్ 2:-రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం కొత్త బాధ్యతలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విశాఖపట్నం సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్ నియమితులయ్యారు. సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇంటెలిజెన్స్ ఎస్పీగా కె. శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈ.జి. అశోక్ కుమార్ నియమితులయ్యారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా షేక్ బేగం నియామకం జరిగింది. సీఐడీ మహిళల భద్రత సెల్–2 ఎస్పీగా వి. రత్న నియమితులయ్యారు.
ఐదో బెటాలియన్ కమాండెంట్‌గా రవిశంకర్ రెడ్డి, సీఐడీ ఎస్పీగా ఆర్. గంగాధర్ రావు బాధ్యతలు స్వీకరించనున్నారు. డీజీపీ కార్యాలయంలో ఏఐజీ ఆర్గనైజేషన్‌గా పనసారెడ్డికి పోస్టింగ్ ఇవ్వగా, ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ ఏఐజీగా వెంకటరత్నం నియమితులయ్యారు.ఎన్టీఆర్ కమిషనరేట్ రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణ, ఈగల్ యూనిట్ ఎస్పీగా కేఎం మహేశ్వర్ రాజు, సైబర్ క్రైమ్స్ కమిషనర్‌గా కృష్ణప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇంటెలిజెన్స్ సీఎంఎస్డీ ఎస్పీగా జగదీష్ నియామకం కాగా, చింతూరు అడిషనల్ ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, సత్యసాయి జిల్లా అడిషనల్ ఎస్పీగా అంకిత మహావీర్ నియమితులయ్యారు.జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా సుష్మిత, చింతూరు ఏఎస్పీగా హేమంత్ బొద్దు, పార్వతీపురం ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి నియామకం పొందారు.ఈ బదిలీలు, నియామకాలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది.







