ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గుంటూరు ఏటి అగ్రహారం 24 వ డివిజన్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ప్రజా ఉద్యమం కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి.కోటి సంతకాలు చేపట్టి రాష్ట్ర గవర్నర్ కి అందజేస్తాం.మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి అంటే రాష్ట్రంలోని ప్రతి పౌరుడు సంతకాల సేకరణలో భాగస్వామ్యం కావాలి. గవర్నర్ ద్వారా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.







