
 
విజయవాడ:03-11-25:-భవానీపురం హెచ్.బి. కాలనీలో నూతనంగా ఏర్పాటైన సూఫీ సేవా సదన్ కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —“సమాజంలో పేదలకు సాయం చేసే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరం. సమాజంలో మార్పుకు సేవా కార్యక్రమాలు దోహదపడతాయి. సూఫీ సేవా సదన్ గత ఇరువై సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమైనవి” అన్నారు.రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, సూఫీ సేవా సదన్ చైర్మన్ ఫైజాన్ సేవా కార్యక్రమాలకు అంకితభావంతో పనిచేస్తున్నారని ఎంపీ ప్రశంసించారు. “తనకు ఉన్న దాంట్లో సమాజానికి మళ్లీ సేవ చేయాలనే ఆలోచన గొప్పదనం. సూఫీ సేవా సదన్ కార్యక్రమాలకు నా పూర్తి సహకారం ఉంటుందని” ఎంపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణరావు,

ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా, గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.ఎస్. బేగ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, డివిజన్ అధ్యక్షుడు పి.వి. సుబ్బయ్య, క్లస్టర్ ఇన్‌చార్జ్ యేదుపాటి రామయ్య, రేగళ్ల లక్ష్మణరావు, ముసాఫిర్ ఖానా కార్యదర్శి అమానుల్లా, కుంచం దుర్గారావు, జాహీద్, పత్తి నాగేశ్వరరావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్. మాధవ, చల్లంరాజు ట్రస్ట్ చైర్మన్ ముదికొండ శివ, నాయకులు గంగవరపు మురళీ, పీతా బుజ్జి, ప్రముఖ కవి ఖాదర్ మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
 
 






