
విజయవాడ:03-11-25:-దేశ సమైక్యత కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా జరగబోయే జైహో మూడవ జాతీయ సమ్మేళనం విజయవంతం కావాలని కోరుతూ విజయవాడ ప్రెస్ క్లబ్‌లో కరపత్రాన్ని ఆవిష్కరించారు.“జైహో జైహో హిందూ ముస్లిం ఏక్ హో… జైహో జైహో సబ్ హిందుస్తానీ ఏక్ హో…” అంటూ నినాదాలతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నవంబర్ 8, 9 తేదీలలో హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్‌లో ఈ సమ్మేళనం జరగనుంది.
ఈ సందర్భంగా జైభారత్ ప్రతినిధులు మాట్లాడుతూ –దేశంలో కొంతమంది మతోన్మాదులు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, సాధారణ ప్రజలు వారి ఉచ్చులో చిక్కుకొని ద్వేష భావనలతో ఒకరినొకరు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమైక్యత, సామరస్యానికి ప్రతీకలైన స్వాతంత్ర్య సమరయోధులు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఖుల్లా ఖాన్, మహాత్మా గాంధీ, గఫార్ ఖాన్, స్వామి వివేకానంద ల స్ఫూర్తితో జైభారత్ ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దేశ సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరు ఈ సమావేశానికి హాజరై జాతీయ ఏకతకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో జైభారత్ ప్రతినిధులు ఖదిజ్ఞాసి శ్రీనివాస్, ఖదిజ్ఞాసి రాజమణి, ఖదిజ్ఞాసి రవీంద్రనాథ్, ఎం.ఎ. రజాక్, నాగలక్ష్మీ మాతాజీ, శివగురు భవాని, తోట వెంకట్రావు, కోరాడ నాగు, బి. రాము, పెద్దపూడి వెంకట్రావు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కాపవరపు ధర్మరాజు, ఆర్. పిచ్చయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.
 
 






