
గుంటూరు:03-11-25:-విజ్ఞానగర్ 1/3వ లైన్‌లోని కమలేష్ ఎస్టేట్స్ అపార్ట్‌మెంట్‌లో సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించిన మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచ శాంతి కోసం భగవంతుడిని ప్రార్థించారు.

తదుపరి ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ –“ప్రతి ఇంటి వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనాలి. రుద్రాభిషేకాలు సమాజానికి శాంతి, సౌఖ్యం ప్రసాదిస్తాయి. ఇలాంటి పూజలు మనలో సానుకూల ఆలోచనలు, సామరస్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల సంక్షేమం కోసం మనం చేసే ప్రతి పూజ, ప్రార్థన ఒక శక్తిగా పనిచేస్తుంది” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల్లో భాగమయ్యారు.
 
 






