
గుంటూరు:03-11-25:-భారత్ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించిన సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అంబరాన్ని తాకేలా సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు పేట ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళలతో కలిసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మహిళలతో కలిసి కేక్ కట్ చేసి, వారికే తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కార్యాలయం ఆవరణలో బాణసంచా కాల్చి, విజయోత్సాహంతో మహిళలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ –“సమాజంలో ఒక ఆడపిల్లకు సరైన అవకాశం, ప్రోత్సాహం కల్పిస్తే ఆమె సాధించలేనిది ఏదీ ఉండదు. ఈరోజు భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచానికి అది నిరూపించింది. మహిళలు క్రీడల రంగంలో ప్రపంచ స్థాయిలో విజయాన్ని సాధించడం ప్రతి భారతీయ మహిళకు గర్వకారణం,” అని పేర్కొన్నారు.టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గారికి, సెమీఫైనల్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి భారత్‌ను ఫైనల్స్‌కి చేర్చిన జెమిమా రోడ్రిగ్స్ గారికి ఎమ్మెల్యే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ విజయానికి వెనుక ఉన్న ప్రతి కుటుంబానికి, వారిని ప్రోత్సహించిన ప్రతి మగవారికి, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక అభినందనలు,” అన్నారు.మహిళల గెలుపు వెనక ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక దేశం నిలుస్తుందని గళ్ళా మాధవి గారు చెప్పారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ ఆలయంలో తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి భారత్ జట్టు విజయాన్ని ప్రార్థించిన విషయం గుర్తుచేశారు.జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా సందేశం:
“గృహిణి అంటే ఇంటిని వెలుగులతో నింపే శక్తి. ఆమె నిరంతరం కుటుంబం కోసం కష్టపడుతూ ఆనందం, ప్రేమ, సంతోషం పంచే నిజమైన యోధురాలు. జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా అన్ని గృహిణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు,” అని తెలిపారు.
నారా భువనేశ్వరి గారికి అభినందనలు:
లండన్‌లో Director’s Institute Award మరియు Golden Peacock Award అందుకున్న నారా భువనేశ్వరి గారుపై గళ్ళా మాధవి అభినందనలు తెలిపారు. “సాధారణ గృహిణి నుండి పరిశ్రమల అభివృద్ధి దిశగా స్ఫూర్తిదాయకమైన మోడల్‌గా నిలిచిన భువనేశ్వరి గారు మహిళలకు ఆదర్శం,” అని అన్నారు.మహిళా శక్తిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ గార్ల దిశానిర్దేశం ప్రశంసనీయం అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు పేర్కొన్నారు.“మహిళలు గెలుస్తే అది దేశ గెలుపే. అలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్న తెలుగుదేశం పార్టీ కూటమిలో మహిళా ఎమ్మెల్యేగా పనిచేయడం నాకు గర్వకారణం,” అని గళ్ళా మాధవి గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక మహిళామణులు పాల్గొన్నారు.
 
 






