
గుంటూరు, నవంబర్ 3:-నల్లమడ వాగులో 55,000 క్యూసెక్కుల నీరు కిందకు పోయే విధంగా తగిన పనులు చేపట్టాలని, వాగు ఉప్పొంగిపోవడంతో పంటలు నష్టపోయిన రైతులకు ఈ-క్రాఫ్ట్ ద్వారా నష్టపరిహారం చెల్లించాలని నల్లమడ రైతులు డిమాండ్ చేశారు.ఈ మేరకు నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ రావు, యార్లగడ్డ అంకమ్మ చౌదరి, లావు అంకమ్మ చౌదరి, హరిబాబు తదితరులు సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్లో వినతిపత్రం సమర్పించారు.

రైతులు మాట్లాడుతూ – వాగు పునరుద్ధరణ పనులు సక్రమంగా చేయకపోవడం వల్ల భారీగా నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోయాయని, వెంటనే నష్టం అంచనా వేసి నష్టపరిహారం అందించాలని కోరారు.కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువచ్చిన అధికారులు రైతుల సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
 






