
కృష్ణా జిల్లా:04-11-25:- ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఈ నెల 4న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన చేపట్టనున్నారు. పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పర్యటించి, ఇటీవల మోంథా తుపానుతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించనున్నారు.
రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకుని, వారికి భరోసా ఇవ్వనున్నారు. తుపానుతో పంటలు నాశనమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ తీవ్రంగా విమర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.జగన్ పర్యటనకు సంబంధించి స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
 
 






