
గుడివాడరూరల్: 04-11-25:-గుడివాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు స్వర్ణ పంచాయతీ వెబ్సైట్లో పంచాయతీల టాక్స్, నాన్టాక్స్ ఎరియర్స్ (బకాయిలు) అంశంపై సమీక్ష సమావేశం జరిగింది
.మండల అభివృద్ధి అధికారి (MPDO) మరియు ఉప మండల అభివృద్ధి అధికారి (Dy. MPDO) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండలంలోని అన్ని పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.ప్రతి పంచాయతీకి సంబంధించిన బకాయిల వివరాలను అధికారులు సమీక్షించి, ఈ నెల 10వ తేదీలోపు క్యూ.ఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు పూర్తిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ క్యూ.ఆర్ కోడ్ పోస్టర్ను MPDO విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.







