ఆంధ్రప్రదేశ్గుంటూరు
GUNTUR NEWS: విద్య వ్యవస్థలో మార్పులు ..
GUNTUR NEWS: విద్య వ్యవస్థలో మార్పులు ..
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేయాలి..
నూతన విద్యా విధానం వల్ల పేద విద్యార్థులకు ఎంతగానో నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈమేరకు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ 49వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులకు ఏమాత్రం కృషి చేయడం లేదని చెప్పారు. యూనివర్సిటీలకు పూర్తిస్థాయిలో వైస్ ఛాన్సలర్ ల నియామకం జరగడం లేదని చెప్పారు. ఈ కారణంగా ఉన్నత విద్యా వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాల ద్వారానే విద్యా రంగంలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వెల్లడించారు. ఆ దిశగా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలకు రూపకల్పన చేయాలని సూచించారు.