
న్యూఢిల్లీ — వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు దేశ ప్రజలందరూ ఏకస్వరంతో వందేమాతరం గేయం ఆలపించాలని కేంద్రం పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో విజయవంతం చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్లు, ముఖ్యమంత్రులు నేతృత్వంలో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారులు, సామాన్య ప్రజలంతా ఈ గీతగానం కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.జాతీయ గౌరవం, దేశభక్తి భావాలను మరింతగా పెంపొందించేందుకు ఈ సామూహిక వందేమాతరం గానం దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది.







