
సికింద్రాబాద్:06-11-25-:రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ శమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని బృందం గురువారం గాంధీ ఆసుపత్రికి చేరుకుంది. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యసేవలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న వసతులను, పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించారు.
జస్టిస్ శమీమ్ అక్తర్ మాట్లాడుతూ, “రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు గాంధీ ఆసుపత్రికి వస్తున్నారు. వైద్యులు రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కమిషన్ వరుసగా సందర్శిస్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగానే గాంధీని పరిశీలించాం,” అని తెలిపారు.







