
ప్రస్తుత పత్తి సీజన్ 2025-26 కొరకు పత్తి కొనుగోలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ప్రారంభించబడింది. పత్తి రైతుల హక్కులను రక్షించడానికి, కార్పొరేషన్ తన పరిధిలో ఉన్న జిల్లాల్లో మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను తెరిచింది. నాణ్యతా ప్రమాణాల ప్రకారం పత్తిలో తేమ శాతం 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) ఇవ్వబడుతుంది. అయితే, తేమ శాతం 8% కంటే ఎక్కువగా 12% వరకు ఉన్నా, MSP పై 8% పైగా ఉన్న తేమను తక్కువ చేసి చెల్లించబడును. అందువలన, కార్పొరేషన్ పత్తి రైతులను ఆరబెట్టిన పత్తి మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తుంది. తద్వారా అధిక తేమ వలన Deduction (తగ్గింపు) ఉండదు. ఎలాంటి పరిస్థితులలోనైనా, పత్తిలో తేమ శాతం 12% మించకూడదు. ఏదైనా సహాయం అవసరమైతే, రైతులు కార్పొరేషన్ శాఖ కార్యాలయం గుంటూరు ను WhatsApp హెల్ప్ లైన్ నంబర్ 7659954529 ద్వారా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.







