
నందిగామ: దాములూరు:06-11-25:-తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల పార్టీ చూపిస్తున్న ప్రాధాన్యతకు మరొక ఉదాహరణగా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గురువారం దాములూరులో చాటిచెప్పారు.గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మంద రామారావు కుమారుడు మంద హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. హరికృష్ణ పార్టీ కార్యకర్తగా ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లేందుకు కృషి చేసిన వ్యక్తి. ఆయన మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఈ ఘటనపై స్పందించిన గ్రామ, మండల నాయకులు విషయాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేయగా, కార్యకర్త మంద హరికృష్ణ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది.గురువారం దాములూరు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం కుటుంబ సభ్యులకు చెక్కును స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “కార్యకర్తలే పార్టీకి బలం… వారి సంక్షేమం టిడిపి ప్రాధాన్య విధానం. హరికృష్ణలాంటి నిబద్ధత గల కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ మరవదు” అని పేర్కొన్నారు.హరికృష్ణ కుటుంబానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్యకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ, మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







