
హైదరాబాద్, నవంబర్ 6:-హైదర్‌గూడలో నిర్లక్ష్యంగా పురాతన భవనం కూల్చివేత పనులు జరుపుతున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.

అపోలో హాస్పిటల్ పక్కనున్న గల్లీలో ముందస్తు భద్రతా చర్యలు లేకుండా కూల్చివేత చేపట్టడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికుల సమాచారం ప్రకారం—ఎలాంటి అధికార అనుమతులు లేకుండా కూల్చివేత పనులు జరగడంతో, భవన శిథిలాలు సమీపంలోని కరెంట్ పోల్‌పై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అంతేకాక, పక్క ఇళ్లపై శిథిలాలు, వ్యర్థాలు పడటంతో ఆ ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని వాపోయారు.ఈ అంశంపై పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. తక్షణమే భద్రతా ప్రమాణాలు పాటిస్తూ కూల్చివేతలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.







