
విజయవాడ:సింగ్‌నగర్:06-11-25;-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వద్ద సింగ్‌నగర్ ప్రాంత ప్రజలు వినతి పత్రం సమర్పించారు. స్థానిక మసీదు పక్కన ఉన్న పిట్టగోడ కూలిపోవడంతో కొత్తగా గోడ నిర్మాణం చేపట్టాలని వారు కోరారు. ప్రజల ఆవేదనను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే విధంగా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల భద్రత, ప్రాంత అభివృద్ధి కోసం అవసరమైన అన్ని పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.







