chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Vijayawada news:తుపాన్‌ నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: కిసాన్‌ కాంగ్రెస్‌

విజయవాడ, నవంబర్‌ 7 :-మొంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కామన పి. ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు.విజయవాడ సెంటర్‌ నియోజకవర్గంలోని గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సుమారు 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని తెలిపారు. పత్తి రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు చేసినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటికీ నష్టపరిహారం ప్రకటించలేదని విమర్శించారు.కౌలు రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం లేదని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఉల్లి మద్దతు ధర రూ.1200గా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, 3వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి, వారిలో 500 మందికి మాత్రమే చెల్లింపులు జరిపినట్లు ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 26న వామపక్ష పార్టీలతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు సురేంద్రరెడ్డి, ఎ. రామ్మోహనరావు, బి. సత్యనాయుడు, జి. రాత్రెడ్డి, కె. మధుసూదనరావు, పోతిన సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker