chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: ఈనెల 10, 11 తేదీల్లో గుంటూరులో జాతీయ స్థాయి సదస్సు

CENTRAL MINISTER PEMMASANI MEETING

గుంటూరులో జాతీయ స్థాయి సదస్సు 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో ఈ నెల11వ తేదీన జరగనున్న వాటర్ షెడ్ మహోత్సవ్ ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్ సంచాలకులు మైలపల్లి కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శాఖ వాటర్ షెడ్ విభాగం సంచాలకులు వై.వి.కె. షణ్ముఖ కుమార్ లతో కలిసి శనివారం కేంద్ర సహాయ మంత్రి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ సదస్సు గుంటూరులో జరగడం గొప్ప అవకాశం అన్నారు. దీనిని ఒక అవకాశంగా తీసుకుని గుంటూరు పేరు ప్రతిష్టలు మారుమ్రోగే విధంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రతి అంశంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వాటర్ షెడ్ -పిఎంకేఎస్ వై జాతీయ సదస్సు (వాటర్ షెడ్ మహోత్సవ్) రెండు రోజుల పాటు – నవంబరు 10, 11 తేదీల్లో గుంటూరులో జరుగుతుందని ఆయన చెప్పారు.

మొదటి రోజు గుంటూరులో ఐటిసి హోటల్లో ప్రారంభ కార్యక్రమం జరుగుతుందన్నారు. రెండవ రోజు వెంగళాయపాలెంలో జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, అదనపు ఎస్పీ రమణ మూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శంకర్, తహసిల్దార్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker