
విజయవాడ, నవంబర్ 8 (భీమోదయం):-సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఈనెల 20న న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద “హలో దలిత్ – చలో ఢిల్లీ” పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ప్రకటించారు.శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి నల్లమచ్చగా అభివర్ణించారు. ఈ దాడికి పాల్పడిన సనాతన మనువాది రాకేష్ కిషోర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
“ఇది కేవలం గవాయి గారిపై దాడి మాత్రమే కాదు, దళిత సమాజం మీద జరిగిన దాడి. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు,” అని బ్రహ్మయ్య మాదిగ స్పష్టం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం సానుభూతి ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు.దేశ రాజధానిలో జరగనున్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, దళిత సంఘాలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లంక బుజ్జి మాదిగ, టిడిపి రాష్ట్ర నాయకులు పరిశిపోగు రాజేష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, కె. శీను మాదిగ, బి. రాజు మాదిగ, మాతంగి సంజయ్ మాదిగ, బి. లలితా మాదిగ, కె. బెహార్డ్, కె. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.







