
PG (మెడికల్) అడ్మిషన్లు 2025–26 లో భాగంగా విడుదలైన ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ పై ఆన్లైన్ గ్రీవెన్సులు (ఫిర్యాదులు) సమర్పించుకునే గడువు తాత్కాలికంగా మార్చబడింది.అధికారుల సమాచారం ప్రకారం, నవంబర్ 8 మరియు 9 తేదీలలో APTOOnline Limited సంస్థ నిర్వహించే డేటా సెంటర్ మైగ్రేషన్ కార్యకలాపాల కారణంగా, అన్ని సంబంధిత ఆన్లైన్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.
దీని ఫలితంగా నవంబర్ 8, 9 తేదీలలో అభ్యర్థులు తమ గ్రీవెన్సులను సమర్పించలేరు. సేవలు నవంబర్ 10, 2025 నుండి తిరిగి సాధారణంగా అందుబాటులోకి వస్తాయి.అభ్యర్థుల సౌకర్యార్థం, గడువు నవంబర్ 12, 2025 సాయంత్రం 4 గంటల వరకు పొడిగించబడింది.అన్ని అభ్యర్థులు ఈ మార్పులను గమనించి, నిర్ణయించిన కొత్త గడువులోపు తమ గ్రీవెన్సులను సమర్పించాలనీ అధికారులు సూచించారు.







