
చీరాల, నవంబర్ 9:-సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో నవంబర్ 10 నుంచి ఆరు రోజులపాటు అటల్ ఆన్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం (FDP) నిర్వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆధ్వర్యంలోని ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ (ATAL) ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను శనివారం విడుదల చేశారు.
ఆరు రోజులపాటు జరిగే ఈ శిక్షణలో ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ, కాన్సెప్ట్ రీసెర్చ్ ట్రెండ్స్ అండ్ ప్రాసెస్, చాలెంజెస్ పాలసీ అండ్ కాంటినెంట్ వంటి అంశాలపై వివిధ సాంకేతిక సెషన్లు జరుగనున్నాయని చెప్పారు.దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఎన్ఐటీలుకి చెందిన ప్రొఫెసర్లు, అలాగే పరిశ్రమ నిపుణులు పాల్గొని ఫ్యాకల్టీ సభ్యులకు తాజా సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ధోరణులపై అవగాహన కల్పించనున్నారని వివరించారు.ఈ ఎఫ్‌డిపి కార్యక్రమానికి సిఎస్సి ఐఓటి విభాగాధిపతి డా. ఇంద్రనీల్, డా. బి.వి. ప్రవీణ్ కుమార్‌లు కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏ. మనోహర్ తదితరులు పాల్గొన్నారు.







