
బాపట్ల: నవంబర్ 09:– ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నేడు జిల్లా కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజలు అందజేసిన అర్జీలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.తదుపరి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి నేరుగా సమస్యల అర్జీలను స్వీకరించే కార్యక్రమం కొనసాగనుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టరేట్‌తో పాటు ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహశీల్దార్ కార్యాలయాలలో కూడా తహశీల్దార్లు, ఎంపీడీఓలు ప్రజల అర్జీలను స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే ఇచ్చిన అర్జీల పరిష్కారం స్థితి తెలుసుకోవాలనుకునే వారు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని డాక్టర్ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.







