
పాట్నా (బీహార్):-బీహార్ సర్వతోముఖ అభివృద్ధి కోసం యువత మరోసారి ఎన్‌డీఏ ప్రభుత్వానికి అవకాశమివ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. శనివారం పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేను ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా రాలేదు. బాధ్యతాయుతమైన భారతీయుడిగా వచ్చాను. బీహార్‌లో జరగబోయే ఈ ఎన్నిక దేశ రాజకీయాల దిశను నిర్ణయించనుంది” అని పేర్కొన్నారు.లోకేష్ మాట్లాడుతూ, “బీహార్ యువత ఎన్‌డీఏను మళ్లీ గెలిపించాల్సిన మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో ‘ఒక్క ఛాన్స్’ పేరుతో వైసీపీకి అవకాశం ఇచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయి, పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. దాంతో మా రాష్ట్రం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. అలాంటి పరిస్థితి బీహార్‌లో రాకూడదు” అని హితవు పలికారు.1. నాయకత్వం – స్వచ్ఛమైన పాలనకు హామీప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నాయకత్వంలో బీహార్ రూపురేఖలు మారాయని లోకేష్ తెలిపారు. “మోడీజీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బీహార్ పాత్ర కీలకం. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నది ఆయన దృష్టి” అని అన్నారు.2. డబుల్ ఇంజన్ సర్కారు – అభివృద్ధికి బలంఎన్‌డీఏ పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిచేస్తున్నందున బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రం నుండి భారీగా నిధులు వస్తున్నాయని తెలిపారు.
“మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోంది. శాంతిభద్రతల వాతావరణం ఉండటమే పెట్టుబడులను ఆకర్షిస్తోంది” అని వివరించారు.3. ప్రభుత్వాల కొనసాగింపు – అభివృద్ధి సూత్రంలోకేష్ మాట్లాడుతూ, “గుజరాత్, ఒడిశా రాష్ట్రాల వలే ప్రభుత్వాల కొనసాగింపు వల్లే ఆ రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి సాధించాయి. నితీష్‌కుమార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాట్నా రూపం మారిపోయింది. ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు కూడా ఇది అంగీకరించారు” అన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త” అనే నినాదంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు.“బీహార్‌లో కొన్ని పార్టీలు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెబుతున్నాయి — కానీ అవి అసాధ్యమైన హామీలు. ప్రజలు అవి నమ్మకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.“రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలపడుతుంది. ప్రధాని మోడీజీ నాయకత్వంలో బీహార్ అభివృద్ధి పథంలో నడుస్తోంది. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే కేంద్రం నుండి పెద్దఎత్తున నిధులు లభిస్తున్నాయి” అని లోకేష్ అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో బీహార్ మీడియా విభాగం హెడ్, ఎమ్మెల్సీ సంజయ్ మయూక్, పార్లమెంట్ సభ్యులు సానా సతీష్, గంటి హరీష్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.







