
గుంటూరులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, అధికారులతో కలిసి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. “మిర్చి యార్డ్ వద్ద పై వంతెన పనులు వేగంగా జరుగున్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జి జీజీహెచ్ వైపు డిసెంబర్ 15లోపు 7 పిల్లర్లు పూర్తి అయ్యేలా పనులు జరుగుతున్నాయి. శంకర్ విలాస్ వైపు దుకాణాలను తొలగించడంలో కొంత జాప్యం చోటుచేసుకుంది. వ్యాపారులు, ప్రజలు అర్ధం చేసుకుని అభివృద్ధికి సహకరించాలి. షాపుల యాజమాన్యం అడుగుతున్న నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదు. నగరపాలక సంస్థ మేయర్, కమిషనర్ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.







