
బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హిందూ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత గజల్ శ్రీనివాస్, ఆర్. లక్ష్మిపతి, బాలకృష్ణ, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా భారతీయ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ గజల్ శ్రీనివాస్ ప్రత్యేక గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమం వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు.







