
గుంటూరు సమీపంలోనీ పెదకాకానిలో శంకర కంటి ఆస్పత్రి నూతన భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి లో నూతన భవన నిర్మాణం. సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రంలో ప్రత్యేకతలను సీఎం కు వివరించిన నిర్వాహకులు. క్యాంపస్ లోని అన్ని ప్రాంతాలను సందర్శించి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. శంకర ఐ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సర్జరీలు, ఐ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవలను సీఎం కు వివరించిన నిర్వాహకులు.







