
చింతలపూడి: నవంబర్ 9:-ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తిక వనభోజన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక రవి ఫ్యాన్సీ వారి వాసవి గ్రాండ్ లో జరిగిన ఈ వేడుకకు పట్టణ ఆర్యవైశ్య కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందంగా గడిపారు.ఆర్యవైశ్య సంఘం నాయకుడు వజ్రపు శేఖర్ మాట్లాడుతూ, “కార్తిక మాసంలో వనభోజనాలు ఐక్యతకు ప్రతీక. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆధ్యాత్మికత, ఆనందం పంచుకునే కార్యక్రమంగా దీన్ని ప్రతి సంవత్సరం మరింత విస్తృతంగా నిర్వహిస్తాం” అని తెలిపారు.

వనభోజనంలో భాగంగా మహిళల కోసం ఆటపాటల పోటీలు నిర్వహించగా, వేగ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు షుగర్, బీపీ వంటి ఆరోగ్య పరీక్షలు చేపట్టారు.

ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి కొనకళ్ళ ప్రసాద్, అబ్బయ్య మాస్టారు, పులిపాటి హరికృష్ణ, కే. త్రినాథ్, అడపా శ్రీను, చిట్లూరు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.







