
మంగళగిరి:09-11-25:- మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామంలోని యాదవపాలెంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆలయం పునః నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ విరాళం అందించారు. ఆదివారం మంత్రి నారా లోకేష్ పంపించిన రూ. 5 లక్షల విరాళాన్ని స్థానిక నాయకులు కమిటీ సభ్యులకు అందజేశారు. దేవస్థానం ఆలయం పునః నిర్మాణానికి సహకరించిన మంత్రి నారా లోకేష్ కు యర్రబాలెం గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా , మండల పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, శ్రీకృష్ణుడు యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడు మంత్రి నారా లోకేష్‌కు ఉండాలని కోరారు. భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
అందులో భాగంగా ఆలయంకు విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీ కృష్ణుడు ఆలయం పున:నిర్మాణంలో ప్రజలు, భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణంలో పాత్రులు కావాలని కోరారు. శ్రీకృష్ణుడి ఆలయం పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చావలి ఉల్లయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు నీలం అంకరావు, ఆకుల పానకాల రావు, గడదాసు రంగారావు,ఆర్థల పిచ్చయ్య, కర్నాటి సత్యనారాయణ, తోట శ్రీను, తోట సురేష్, మిర్యాల సత్యనారాయణ, యలమంచిలి పద్మజ, అప్పల శాంతి, దానబోయిన శివశంకరరావు, రుద్రు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు







