chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

AP POLITICAL NEWS: లోకేష్ నిద్ర పోతున్నా జగన్ కల్లోకి వస్తున్నాడు

YSRCP LEADER AMBATI FIRE ON CHANDRA BABU

ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ లీగల్ సెల్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు జిల్లా కోర్టు వద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో 12న ర్యాలీలు చేపట్టి కలెక్టర్లు, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు. వ్యాపార ప్రక్రియలో వైద్యరంగాన్ని విస్తరిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం దేవుణ్ణి అడ్డుపెట్టుకొని దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తోందని రాంబాబు ధ్వజమెత్తారు. టీటీడీ భోజనం అనేది ఆనవాయితీగా వస్తుందని, ఆ భోజనం అద్భుతంగా ఉందన్న మాత్రానా చంద్రబాబు, బి.ఆర్ నాయుడును పొగిడినట్లు కాదని స్పష్టం చేశారు. లోకేశ్ నిద్రపోతున్నా జగన్ కలలోకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు జగన్‌కి ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా, లీగల్ సెల్ నాయకులు పోలూరి వెంకట్ రెడ్డి, సీ.డీ భగవాన్, కొమ్మారెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker