chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News:-కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుంది — కలెక్టర్ తమీమ్ అన్సారియా

గుంటూరు: నవంబరు 10 :-జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు చేపట్టిన Leprosy Case Detection Campaign (LCDC) సర్వే పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది.కలెక్టర్ మాట్లాడుతూ ఈ సర్వేను నవంబరు 17 నుండి 30 వరకు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశా కార్యకర్తలు, పురుష వాలంటీర్లు కలసి ఇంటింటికి వెళ్లి సర్వే చేపడతారని వివరించారు.

మొత్తం 5,56,616 గృహాలను 1,167 టీములు సందర్శించి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించనున్నట్లు చెప్పారు. సర్వే ద్వారా గుర్తించిన రోగులకు అవసరమైన MDT మందులు ఉచితంగా అందించబడతాయని, ఈ మందులు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.“కుష్టు వ్యాధి భయపడాల్సిన అవసరం లేదు. సరైన చికిత్సతో ఇది పూర్తిగా నయమవుతుంది. అందువల్ల ఇంటింటికి వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించి పరీక్షలు చేయించుకోవాలి,” అని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కే. ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారి, డీఎంఎండ్‌హెచ్‌ఓ డా. విజయలక్ష్మి, పీడీ డీఆర్‌డీఏ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్ డా. ఎస్‌.వి. రమణ, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, ఏడీ మైక్రో ఇరిగేషన్ వజ్రశ్రీ, ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్ఈ చక్రవర్తి, కలెక్టరేట్ అధికారులైన పూర్ణ చంద్రరావు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker