chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Media realations portal nu:-మీడియా రిలేషన్స్ పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించిన -మంత్రి కొలుసు పార్ధసారధి

అమరావతి:నవంబరు 10:-రాష్ట్రంలోని జర్నలిస్టులకు 2026–2027 రెండేళ్ల కాలానికి అక్రిడిటేషన్లు జారీ చేసేందుకు రూపొందించిన **‘మీడియా రిలేషన్స్ పోర్టల్’**ను సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.ఎపి సచివాలయం ప్రచార విభాగంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచారశాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాధన్తో కలిసి మంత్రి పోర్టల్‌ను ఆవిష్కరించారు.

గతంలో జారీ చేసిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు ఈ నెల 30తో ముగియనుండగా, రాబోయే రెండేళ్ల (2026–2027) కాలానికి కొత్త అక్రిడిటేషన్ల జారీ కోసం వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేసే ప్రతినిధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.రాష్ట్ర మరియు జిల్లాస్థాయి అక్రిడిటేషన్లకు అర్హులైన జర్నలిస్టులు ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. అలాగే దరఖాస్తు చేసిన ప్రతినిధులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను కూడా వెబ్‌సైట్‌లో నేరుగా తెలుసుకునే సౌకర్యం కల్పించబడిందని పేర్కొన్నారు.పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే విధానం, అవసరమైన పత్రాల వివరాలను మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించనున్నట్లు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker