ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన ఆందోళన జరగనుంది. లక్ష డబ్బులు, వేల గొంతులు నినాదంతో చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మార్పీఎస్ నేతలు సురేష్, సత్యం, కుమార్, ప్రేమానందం, జాన్సన్ తదితరులు శనివారం గుంటూరులో విడుదల చేశారు. వర్గీకరణ జరిగే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఎమ్మార్పీఎస్ వారు స్పష్టం చేశారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మాదిగలు రావాలని కోరారు.
231 Less than a minute