
చీరాల: నవంబర్ 11:-బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ గారి సూచనలతో చీరాల సబ్‌డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో ఆమోదగిరిపట్నం జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెడబలమి శేఖర్‌రావు అధ్యక్షత వహించగా, చీరాల వన్‌టౌన్ సీఐ సుబ్బారావు ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. శక్తి బృందం ఎస్‌ఐ ఎ. హరిబాబు, పిసి కే. సుబ్బారావు, సునీత, ధనలక్ష్మి లు విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ హరిబాబు మాట్లాడుతూ, శక్తి యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు వంటి నేరాలను అరికట్టడంలో ఈ యాప్ కీలకపాత్ర వహిస్తుందని తెలిపారు.అలాగే విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల గురువులకు తెలియజేయాలని సూచించారు.సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికల్లో ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో వస్తున్న ఫేక్ న్యూస్‌లకు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు హెచ్చరించారు.ఏదైనా సమస్య తలెత్తినప్పుడు హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112కు కాల్ చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో పిటి మాస్టర్ పల్లపోలు మధుబాబు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం బి. శివప్రసాద్, ఉపాధ్యాయులు కే. సుధాకర్‌రావు, వై. రత్నం తదితరులు పాల్గొన్నారు.










