
అమరావతి: నవంబర్ 11:– ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రారంభమైంది. రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది రెస్ట్రూమ్లో మంగళవారం ఈ పరీక్షలను నిర్వహించారు.ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డా. సి.ఎం. త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు, మందడలోని హాసిని కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో డా. రహీమ్ బాష నేతృత్వంలో ఈ శిబిరం జరుగుతోంది.

రాష్ట్ర సచివాలయ ముఖ్య భద్రతాధికారి మల్లికార్జునరావు మాట్లాడుతూ, “మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు ఎస్పీఎఫ్ పోలీసు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతి సిబ్బంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఎం. వెంకటేశ్వర్లు, ఎస్. రమణ, ఎం.వి. శివకుమార్‌తో పాటు ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.







