Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: జోహ్రాన్ మమ్దాని విజయం మార్పుకు నాంది – కె.ఎస్. లక్ష్మణరావు

JOHRAN MEETING IN GUNTUR

అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో డెమోక్రటిక్ సోషలిస్ట్ గా విజయ బావుటా ఎగిరేసి ప్రపంచంలో మార్పుకు నాంది పలికి ప్రత్యామ్నాయ మార్గాన్ని జోహ్రాన్ మమ్దాని చూపెట్టారని శాసనమండలి మాజీ సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు తెలిపారు. ఈనెల 12వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని విజయంపై విశ్లేషణ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా పాల్గొన్న కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ జోహ్రాన్ మమ్దాని విజయం ఆర్థిక అసమానతల పై, జీవన వ్యయ సంక్షోభం పై విజయంగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా లాంటి వాళ్ళ విమర్శలను సైతం ఎదుర్కొని, లక్షమంది వాలంటీర్ల సహకారంతో సు స్పష్టమైన ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందు ఉంచి భారీ విజయం సాధించారన్నారు. ట్రంప్ పాలన పట్ల విసిగి వేసారిన న్యూయార్క్ ఓటర్లు జోహ్రాన్ మమ్దాని విజయం వైపు మొగ్గారన్నారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.హనుమంత రెడ్డి ప్రసంగిస్తూ తల్లిదండ్రుల నుండి నేర్చుకున్న ప్రగతిశీల భావాలు, ఆఫ్రికానా స్టడీస్ నేపథ్యం మమ్దాని విజయానికి పునాదులు వేశాయన్నారు. దాదాపు 11 లక్షల మంది న్యూయార్క్ ఓటర్లు కొద్దిపాటి మొత్తంలో విరాళాలు అందించి మమ్దాని విజయమే ధ్యేయంగా ఓటింగ్ లో పాల్గొని 50.4 శాతం ఓటింగ్ తో విజయాన్ని అందించారన్నారు. సోషలిస్ట్ దృక్పథం తో వలస వాదానికి వ్యతిరేకంగా ఇస్లాం ఫోబియాను అధిగమించి ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారని తెలిపారు. బాల్యంలో ఉగాండాలో చవి చూసిన పేదరికం, న్యూయార్క్ లో ఎదుర్కొన్న వివక్షత మమ్దాని లో కసిని పెంచాయన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ న్యూయార్క్ లో ఉన్న పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు లాంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగుతున్నాయని, జోహ్రాన్ మమ్దాని విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను భాగస్వాములను చేసి ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల వైపు దృష్టి సాధించేందుకు కృషి జరగాలన్నారు. గెలుపు అనంతరం జోహ్రాన్ మమ్దాని ఇచ్చిన ఉపన్యాసంలో భారతీయ మూలాలను మరిచి పోకుండా జవహర్ లాల్ నెహ్రూ భావాలను ప్రస్తావించడం స్ఫూర్తి దాయకమన్నారు. బిలీనియర్లు కేంద్రంగా ఉన్న న్యూయార్క్ లో ఓ సామాన్య వ్యక్తీ గెలుపొందడం అద్వితీయమన్నారు. ఓ సోషలిస్ట్, ఓ ముస్లిం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధాలనాకు ఎదురొడ్డి నిలబడి గెలవడం ప్రజాస్వామ్య వాదులను ఆలోచింప చేసిందన్నారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డి.ఎ. ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ జోహ్రాన్ మమ్దాని ఎన్నిక ట్రంప్ ఆర్థిక, రాజకీయ, విదేశాంగ విధానాల వ్యతిరేక విజయంగా అభివర్ణిస్తూ భవిష్యత్తులో రాబోవు ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవలేదనే సంకేతాన్ని కలిగించిందన్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్, ప్రముఖ ప్రొఫెసర్ మొహమ్మద్ మమ్దాని తల్లితండ్రులు కావడం వారి నుండి పొందిన ప్రజాస్వామ్య, సోషలిస్ట్ భావాలు జోహ్రాన్ మమ్దాని విజయానికి దోహదపడ్డాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజాస్వామ్యవాదులు న్యూయార్క్ విజయం నుండి గుణ పాఠాలను నేర్చుకుని ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల వైపు ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అడిషనల్ ఎస్పీ కె. వి.చలపతిరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేత వల్లూరి సదాశివరావు, బత్తుల కోటేశ్వరరావు, సదాశివన్, ఆలా అనంత రామయ్య, కొల్లి రంగారెడ్డి, నరేంద్ర, విఠల్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button