
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కార్యాలయంలో రెండో వారం కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు ఎమ్మెల్యే గళ్ళా మాధవి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచీ కంచుకోట. ఈ కంచుకోట బలంగా నిలవడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కార్యకర్తలతో నిరంతరం సంబంధం కొనసాగిస్తూ, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుంది. పార్టీ బలపర్చే మార్గం అని తాను నమ్ముతున్నానని, అందుకే ప్రతి బుధవారం ఈ ‘కార్యకర్తలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తూ ఉన్నామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. గత వారంలో కార్యకర్తలు సూచించిన సమస్యలను, సలహాలను సమీక్షించి చాలా అంశాలను ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు. ఈ వారం కూడా కార్యకర్తల నుండి వచ్చిన కొత్త సూచనలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణం. వారితో సమీపంగా ఉండి ప్రతి సమస్యపై స్పందించడమే మా ధ్యేయం. అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతుంది” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. అదేవిధంగా గురువారం తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారం జరగనున్న సందర్భంగా, డివిజన్ ప్రెసిడెంట్లు మరియు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.







