Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR DISTRICT NEWS: ధాన్యం, పత్తి కొనుగోలు సజావుగా కొనసాగేలా అధికారులు చర్యలు చేపట్టాలి

COLLECTOR MEETING ON PADDY PROCUREMENT

జిల్లాలో రైతుల నుండి ధాన్యం , పత్తి కొనుగోలు సజావుగా కొనసాగేలా అధికారులు అన్ని ముందస్తు చర్యలు పటిష్టంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. 2025-26 ఖరీఫ్ సీజన్ రైతు సేవ కేంద్రాల ద్వారా , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోలు , సిసిఐ ద్వారా పత్తి కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ధాన్యం నాణ్యత ప్రమాణాల మీద శ్రద్ధ వహించాలన్నారు. ధాన్యం తేమ శాతం నిర్దిష్ట ప్రమాణాలలో ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతు సేవ కేంద్రం వద్ద నియమించిన టెక్నికల్ అసిస్టెంట్ ధాన్యం తేమ శాతం జాగ్రత్తగా పరిశీలించాలని తద్వారా కొనుగోలు సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అన్ని మాయిశ్చర్ మీటర్లు సక్రమంగా క్యాలిబ్రేషన్ చేయించుకుని అన్ని విధాలుగా సంసిద్ధముగా ఉండాలని ఆదేశించారు. తెనాలి , కొల్లిపర మండలాల్లో ఈ నెల 28 నుండి వరి కోతలు ప్రారంభమవుతాయని , ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనే సంచులు ముందస్తుగానే రైతు సేవ కేంద్రాలలో ఏర్పాటు చేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు తమ పాత్రను సమర్ధంగా నిర్వహించాలని, రైతులకు పూర్తిగా అండగా ఉండాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కార్యకలాపాలలో, జి.పి.ఎస్ అమర్చిన వాహనాలు మాత్రమే ధాన్యం రవాణా కోసం ఉపయోగించాలని తెలిపారు. ఈ వాహనాల వివరాలను ముందస్తుగా పోర్టల్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, జి.పి.ఎస్ అమర్చిన వాహనాల వివరాలను సేకరించాలని ఆదేశించారు. జి.పి.ఎస్ అమర్చిన వాహనాలను సక్రమంగా ఉపయోగించి, రవాణా ప్రక్రియను సులభతరం చేసి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుపై రూపొందించిన ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ధాన్యంలో పోర్ట్ ఫైడ్ రైస్ కలిసిందో లేదో కనుగొనే కిట్ ను ఆవిష్కరించి పని చేసే విధానాన్ని పరిశీలించారు. పత్తి కొనుగోలుపై మాట్లాడుతూ పత్తి సేకరణలో తరచూ తలెత్తే సందేహాలను స్పష్టంగా నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. పత్తి కొనుగోలుకు సంబంధించి రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. తేమ శాతంపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో వున్న తాడికొండ, ఫిరంగిపురం , ప్రత్తిపాడు , గుంటూరు లలో పత్తి కొనుగోలు కేంద్రాలు వున్నాయని , ప్రత్తిపాడు లోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగిందన్నారు. తేమ శాతం 12 కన్న తక్కువ వున్న కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి , పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ కె.తులసి , వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ , తెనాలి రవాణా అధికారి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button