కృష్ణాఎన్టీఆర్ విజయవాడ
GUDIWADA: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్’ క్రైస్తవ మహాసభలు ఫిబ్రవరి 7,8,9 తేదీలలో
కృష్ణాజిల్లా:”ఫుల్ గాస్పల్ చర్చస్ ఆఫ్ఇండియా”గుడివాడ వారు నిర్వహించు’గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్’ క్రైస్తవ మహాసభలు ఫిబ్రవరి 7,8,9 తేదీలలో చర్చి ఆవరణంలో నిర్వహి స్తున్నామని, కన్వీనర్ రెవరెండ్ జాషువా డానియల్ తెలియజేశారు. ఈ సందర్భంగా”ప్రెసిడెంట్ ఫుల్ గాస్పెల్ చర్చిస్ ఆఫ్ ఇండియా” బిషప్ డాక్టర్ అప్పికట్ల జాషువా మాట్లాడుతూ!విశ్వాసాన్ని బలపరిచే దైవ సందేశాలు, శక్తివంతమైన స్తుతి ఆరాధన, రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.మహాసభలకు సంబంధించిన సన్నాహక సభను చర్చి ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.